పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

107


అర్జీలు పంపారు ప్రతినిధి బృందాలు వెళ్లి కలిశాయి తెల్లజాతి అధికార్లు మాత్రం తమను కలిసిన వారందరికీ "ఎట్టి పరిస్థితుల్లోను, భారతీయులు ట్రాన్స్‌వాల్‌లోకి దూరడానికి వీలులేదు. అందుకు మేము అంగీకరించము అందువల్ల భారతీయులందరి దగ్గర ఒకే రకమైన అనుమతి పత్రాలు వుండాలి పత్రాలలో వున్న వివరాల ప్రకారం అట్టి పత్రం పొందిన అసలు సిసలు భారతీయుడే దక్షినాఫ్రికాలో ప్రవేశించాలి" అని స్పష్టంగా చెప్పారు

నేను భారతీయులకు ఒక సలహా యిచ్చాను. ఇటువంటి అనుమతి పత్రాలు తీసుకొని తీరాలి అనే చట్టం ఎమిలేదు కాని శాంతిరక్షణ చట్టం అమలులో వున్నంతకాలం అధికారులు మనల్ని ప్రవేశపత్రాలు చూపించమని అడుగవచ్చు. భారతదేశంలో భారతరక్షణ చట్టం (డిఫెన్స్ ఆఫ్ ఇండియా ఆక్టు) అమల్లో వున్నట్లే. దక్షిణాఫ్రికాలో శాంతి రక్షణ చట్టం వున్నది భారతదేశంలో శాంతి రక్షణ ఆక్టు ఎలా భారతీయుల్ని ఇక్కట్లపాలు చేయుటకు ఉపయోగపడుతున్నదో, దక్షిణాఫ్రికాలో కూడా అలాగే తెల్లవాళ్లకు ఉపయోగపడుతున్నది. ఈ చట్టం తెల్లవాళ్లకు వర్తించకపోవడం బహిరంగ రహస్యమే అనుమతి పత్రాలు తీసుకోవడం తప్పనిసరి అయితే, వాటి మీద సంతకం చేయాలని భారతీయులు వ్రేలిముద్రలు వేసితీరాల్సిందే ఇద్దరు మనుష్యుల చేత గుర్తులు, ముద్రలే ఒకే విధంగా వుండవని పోలీసుశాఖ వారు బహుతెలివిగా కనిపెట్టారు చేతి రేఖల ఆకారాల్ని ముద్రల వ్యత్యాసాల్ని విభజించారు. వేలిముద్రల నిపుణులు రెండు ముద్రల్నిపరిశీలించి చూచి క్షణంలో యివి ఒకడివా లేక వేరు వేరు మనుష్యులనా అను విషయం స్పష్టంగా చెప్పివేస్తారు. అయితే ఫొటో యిమ్మనడం నాకు నచ్చలేదు మహమ్మదీయులు మతరీత్యాకూడా ఫోటోయివ్వరు వారి దృష్టిలో అది చమత విరుద్ధం

ప్రభుత్వాధికారులు మరియు భారతజాతి ప్రతినిధులు కలిసి చర్చించారు తత్ఫలితంగా భారతీయులంతా తమ పాతపత్రాలను యిచ్చి క్రొత్త పత్రాల్ని తీసుకోవాలని, క్రొత్తగా వచ్చే భారతీయులు అనుమతి పత్రాలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. వాస్తవానికి భారతీయులు ఆ విధంగా తీసుకోవలసిన