పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

సజ్జనత్వానికి ప్రతీకారం


అవసరం లేకపోయినా మళ్లీ క్రొత్త ఆంక్షలు ఎదుర్కోవలసిన అవసరం వస్తుందేమోనని ఊహించి పత్రాలు తీసుకొనుటకు అంగీకరించారు. క్రొత్తగా వచ్చే భారతీయులు దొంగచాటుగా ప్రవేశించకూడదని భారతజాతి కోరుతున్నదని కూడా స్పష్టపడుతుందని భావించారు. సుమారు భారతీయులు కొత్త అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఇది చిన్న విషయంకాదు. చట్టరీత్యా అనివార్యం కాకపోయినా, పూర్తి ఐకమత్యంతో భారతీయులంతా త్వరగా చేసి చూపించారు. ఇది భారతజాతియొక్క నిజాయితీకి. చాతుర్యానికి, తెలివితేటలకు, నమ్రతకు తార్కాణమని చెప్పవచ్చు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం చేసే చట్టాల్ని ఉల్లంఘించడం భారతీయుల స్వభావలక్షణం కాదని కూడా రుజుచేశారు. ప్రభుత్వానికి యింతటి సుహృద్భావంతో సహకరిస్తున్న భారతీయుల విషయంలో ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం కూడా సుహృద్భావంతో వ్యవహరించాలని భారతీయుల ఆశ, అభిలాష ఆ ప్రభుత్వం తమను గౌరవిస్తుందని, అధికారాలు కూడా యిస్తుందని ఆశించారు. అయితే ట్రాన్స్‌వాల్‌లో నెలకొన్న బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సజ్జనత్వానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నదొ తరువాతి ప్రకరణంలో తెలుసుకుందాం

11

సజ్జనత్వానికి ప్రతీకారం

ఖూనీ చట్టం

పాతకొత్త పత్రాల మార్పు జరిగింది. 1906వ సంవత్సరంలో అడుగుపెట్టాం నేను 1903లో ట్రాన్స్‌వాల్‌నందు రెండవసారి అడుగుపెట్టాను. ఆ ఏడాది జోహాన్స్‌బర్గులో ఆఫీసు తెరిచాను ఈ విధంగా నారెండు సంవత్సరాల కాలం ఏషియాటిక్ శాఖవారి ఆక్రమణల్నిఎదుర్కోవడానికి సరిపోయింది. పత్రాల మార్పు జరిగాక ప్రభుత్వం శాంతిస్తుందని. వ్యవహారం చక్కబడుతుందని అంతా అనుకున్నారు. కాని భారతజాతి ముఖాన శాంతిరాసి లేదు. గత ప్రకరణంలో నేను శ్రీ లైనల్ కర్టిస్‌ను పరిచయం చేశాను. భారతీయులు