పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

109


క్రొత్త పత్రాలు తీసుకున్నంత మాత్రాన తెల్లవారి అభిలాష నెరవేరలేదని, పెద్దమనుషుల ఒడంబడికలద్వారా అది పూర్తి కాలేదని ఆయన భావించారు దానితోబాటు చట్టంకూడా వుంటే, ఒడంబడికకు బలం వస్తుందనీ, అప్పుడే షరతుల ఆంతర్యం నెరవేరుతుందనీ, భారతీయుల్ని అంకుశంలో వుంచాలనీ, అందుకోసం కఠినచట్టం అమలు చేయాలనీ, తత్ఫలితంగా దక్షిణాఫ్రికా యందంతట అది అమలులోకి వచ్చి తీరుతుందనీ ఆయన భావించాడు తాను చేసిన చర్యను మిగతా రాజ్యాలు కూడా అనుసరించాలనే నిర్ణయానికి వచ్చాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఏ ఒక్కద్వారం భారతీయులకోసం తెరిచియుండకూడదని, అలా వుంటే ట్రాన్స్‌వాల్‌కు రక్షణ లేదని కూడా భావించాడు. అసలు ట్రాన్స్‌వాల్ ప్రభత్వానికి, భారతీయులకు జరిగిన ఒడంబడికవల్ల భారతీయుల గౌరవ ప్రతిష్ఠలు పెరిగిపోయాయని, కనుక గట్టి దెబ్బతీయాలని భావించడు. అతడికి భారతీయులంటే విలువలేదు లెక్కకూడాలేదు. కఠోరచట్టం అమలు పరిచి భారతీయుల్ని గడగడవణికించి వేయాలని నిర్ణయానికి వచ్చాడు. అందుకోసం అతడు ఏషియాటిక్ ఆక్టును తయారుచేశాడు. ట్రాన్స్‌వాల్ ప్రభుత్వాధినేతలికి ఏషియాటిక్ ఆక్టును ప్యాసుచేయాలని, భారతీయుల దొంగరాకను అరికట్టివేయాలని, అప్పుడే ట్రాన్స్‌వాల్ యందలి శ్వేతజాతీయులు నిశ్చింతగా. క్షేమంగా వుండగలరని బాగా ఎక్కబోశాడు శ్రీ కర్టిస్ చేసిన బోధ అతడు తయారు చేసిన ఏషియాటిక్ ఆక్టు ట్రాన్స్‌వాల్ ప్రభుత్వానికి నచ్చాయి. ఆ ముసాయిదా ప్రకారం తయారుచేసి అసెంబ్లీలో పెట్టబోతున్న ఆక్టును ప్రభుత్వ గెజెట్‌లో ప్రభుత్వం వారు ప్రచురించారు

ఈబిల్లును గురించి వివరించేముందు మరో ఘట్టాన్ని గురించి వ్రాయడం అవసరమని భావిస్తున్నాను సత్యాగ్రహోద్యమానికి ప్రేరకుణ్ణి నేను కనుక నాజీవితాన్ని పాఠకులు తెలుసుకోవడం అవసరం భారతీయుల్ని దెబ్బతీయాలని ట్రాన్స్‌వాల్‌లో తెల్లవాళ్లు ప్రయత్నిస్తున్న అదే సమయంలో అక్కడి హబ్షీలలోను, జూలూలలోను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే తలంపు చోటుచేసుకున్నది. ఆ వ్యతిరేకతను తిరుగుబాటు అనవచ్చునా లేదా అని నాకు