పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

యుద్ధం తరువాత


బ్రతకాలని కోరుకుంటున్నానో ఎ సత్యాగ్రహంకోసం చావుకు సైతం సిద్ధపడివున్నానో, ఆ సత్యాగ్రహం పుట్టుక ఎలాజరిగిందో ప్రధమంగా సామూహికంగా సత్యాగ్రహప్రయోగం ఎలా జరిగిందో, అవివరాలన్నీభారతదేశప్రజలు తెలుసుకోవాలి సాధ్యమైనంతవరకు ఆచరణలో పెట్టాలి ఈ లక్ష్యంతోనే యీ గ్రంధం వ్రాస్తున్నాను

ఇక మనం తిరిగి మన కథకు వద్దాం. క్రొత్త వాళ్లను లోనికి రానీయకూడదని, వున్నవాళ్లను నఖశిఖపర్యంతం బిగించి దేశం వదిలి పారిపోయేలా చేయాలని ట్రాన్స్‌వాల్ ప్రభుత్వం నిర్ణయించుకున్నది. భారతీయుల్ని మేము కట్టెలుకొట్టి బ్రతికేవారుగాను, కావళ్లు మోసేవాళ్లుగాను మాత్రమే దక్షిణాఫ్రికాలో వుండనిస్తామని కొమ్ములుతిరిగిన తెల్లవాళ్లు ప్రకటనలు చేశారు కూడా ఏషియాటిక్ విభాగంలో అక్కడి తెల్లవాళ్లతోబాటు, ఇండియాలో వుండి వచ్చిన శ్రీ లాయనల్ కర్జిస్ వంటి ప్రచారకులు కూడా వున్నారు. వీళ్లంతా 1905, 1906లో నవయువకులే లార్డ్ మిల్నరుకు నమ్మకస్తులే ప్రతిపని వైజ్ఞానిక దృక్పథంతో చేస్తున్నామని వారి వాదన పెద్దపెద్ద తప్పులు కూడా చేస్తూ వున్నారు. వాళ్లు పెద్ద తప్పుచేసి జోహన్స్‌బర్గ్ మునిసిపాలిటీకి ఎన్నో పౌండ్ల నష్టం కలిగించారు

దక్షిణాఫ్రికాలోకి క్రొత్త భారతీయులు ఎవ్వరూ రాకుండా ఆపాలంటే, తేలికమార్గం ఒక్కటే ఇప్పుడు దక్షిణాఫ్రికాలోగల భారతీయుల అనుమతి పత్రాలన్నీ సువ్యవస్థితంగా తిరిగి రిజిష్టరు చేయించాలి అప్పుడు ఒకడికి బదులు మరొకడు దూరడానికి అవకాశం వుండదు. ఒకవేళ దూరినా తప్పక దొరికిపోతాడు. ట్రాన్స్‌వాల్‌లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భారతీయులకు యిచ్చే అనుమతి పత్రాల మీద వాళ్ల సంతకాలు చేయించారు సంతకం చేయలేనివారి వేలిముద్రలు వేయించారు. తరువాత ఎవడో ఒక జంగ్ల అధికారి వాళ్ల ఫొటో కూడా వుంటే యిక తిరుగువుండదని సూచించాడు. దానితో ఫొటో, సంతకం, వేలిముద్రలు ప్రారంభమయ్యాయి ఇందుకు చట్టం అవసరమని వాళ్లు భావించలేదు. ఈ విషయం భారతీయనాయకులు కూడా గమనించలేదు. జాతి తరఫున ప్రభుత్వానికి