పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

105


దేశంలోనే సాంఘికపరంగా ద్వేషం జడలు విరబోసుకొని వుంటే దక్షిణాఫ్రికావంటి దేశంలో తెల్లజాతివాళ్లు అనుమానం కలిగితే చాలు మిగతారంగుల వాళ్లను బ్రతికివుండగానే కాల్చి వేయరా" దక్షిణాఫ్రికాలో ప్రబలిన యీ దండించే విధానానికి గలపేరు ఒకటి ఇంగ్లీషులో ప్రచారం పొందింది. దాన్ని లించ్‌లా ఆంటారు. లించ్‌లా అంటే శిక్లముందు విధిస్తారు. విచారణ తరువాత సాగిస్తారు అని అర్థం లించ్ అనే పేరుగల ఒక మనిషి పేరట యీ శబ్దం ప్రచారంలోకి వచ్చింది. ఈ రకమైన పద్దతిని అతడే ప్రారంభించాడు. కనుక వాడిపేరట దాన్ని లించ్‌లా అని అన్నారు

ఈవిధంగా పైన తెల్లవాళ్లు తెలిపిన తర్కంలో సారమేమీ లేదని పాఠకులు గ్రహించియే యుంటారు. అయితే విభిన్న అభిప్రాయాలుగల తెల్ల వారంతా యిటువంటి వాదనయే చేస్తున్నారని భావించకూడదు. తమ యీతర్కం కేవలం తాత్వికపరమైనదని వారిలో చాలామంది ప్రకటించారు వాళ్ల స్థితిలో మనం కూడా వుండివుంటే వాళ్లలాగానే మనం కూడా భావించి వుండేవాళ్లమేమో చెప్పలేము యిలాంటి కారణాలవల్లనే “బుద్ధి కర్మాను సారిణీ" అను సామెత ప్రచారంలోకి వచ్చింది. మనం మన అంతఃకరణంలో ఎలా భావిస్తామో, అలాంటి తర్కమే ప్రకటిస్తూ వుంటామని అందరికీ తెలిసు మన అట్టితర్కం యితరులు అంగీకరించపోతే మనం సహించలేము కోపం తెచ్చుకుంటాం

నేను కావాలనే యీ విషయాన్ని యింత వివరించి వ్రాశాను పాఠకులు విభిన్న దృక్పధాల్ని తెలుసుకోవాలని, యిప్పటివరకు ఆవిధంగా తెలుసుకోనివారు విభిన్న దృక్పధాల్ని తెలుసుకోవడమేగాక, వాటిని ఆచరించడం నేర్చుకోవాలని కోరుతున్నాను. సత్యాగ్రహం అంటే ఏమిటో తెలుసుకోవడానికి, దాన్ని ప్రయోగించడానికి ఉదారబుద్ధి, ఓర్పు చాల అవసరం యీగుణాలు లేకపోతే సత్యాగ్రహం సాధ్యంకాదు, యీ పుస్తకంలో, కేవలం వ్రాయాలని నేను యిదంతా వ్రాయడంలేదు. దక్షిణాఫ్రికా సత్యాతగ్రహ చరిత్రను భారతదేశ ప్రజలకు తెలియజేయుటకే యిదంతా వ్రాయడం లేదు. ఈ పుస్తకాన్ని వ్రాయడానికి నా అసలు లక్ష్యం ఒక్కటే ఏ సత్యాగ్రహం కోసం బ్రతుకుతున్నానొ,