పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

యుద్ధం తరువాత


తూర్పుదేశాల్లో లభిస్తే, వాటివల్ల నేను తెలిపిన సిద్ధాంతానికి ఏమీ దెబ్బతగలదు. నా సిద్ధాంతాన్ని సమర్థించే ఉదాహరణలు ఎన్నో వున్నాయి ఏది ఏమైనా పాశ్చాత్య తత్వజ్ఞానుల ప్రకారం పాశ్చాత్య నాగరికతయొక్క మూలసిద్ధాంతం అపరిమితమైన పశుబలం మీద ఆధారపడి వున్నది అందువల్లనే. అసభ్యతను రక్షించదలచిన వాళ్లు పశుబలాన్ని ఉపయోగిస్తున్నారు. తమ అవసరాల్ని పెంచుకోని ప్రజలు చివరికి నాశనమైపోతారని కూడా వాళ్ల వాదన సాగుతున్నది. యీ సిద్ధాంతాలననుసరిస్తున్న తెల్లజాతి ప్రజలు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారు తమ సభ్యతకంటే ప్రాచీన సభ్యతగల. తమకంటే ఎక్కువ సంఖ్యలోనున్న హబ్షీలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆట్టిస్థితిలో భారతదేశమందలి బీదప్రజలకు వాళ్లు భయపడతారా? నిజానికి తూర్పు ప్రజల నాగరికతకు వాళ్లు భయపటంలేదు అందుకు పెద్ద తార్కాణం ఒకటి వున్నది భారతీయులు గిర్‌మిట్ కార్మికులుగా ఎంతమంది దక్షిణాఫ్రికాకు వచ్చినా. తెల్లవాళ్లకు యిబ్బందిలేదు. వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగించరు

అయితే వ్యతిరేకిస్తున్నది. ఎందుకు? వ్యాపారంలో పోటీ వుంటుందనే కదా? ధనార్జన తగ్గుతుందనేకదా! రంగు భేదమే కదా! భారతీయులే చేసే వ్యాపారం వల్ల చిన్న చిన్న తెల్లజాతివ్యాపారులు దెబ్బతింటున్నారనీ, గోధుమరంగు చర్మం గలవారిని చూస్తే చాలు తెల్లరంగు చర్మం కలవాళ్లు మండిపడుతున్నారని, వాళ్లంటే అసహ్యం ద్వేషం తెల్లవాళ్లకు అధికంగా వున్నదని చాలామంది తెల్లవాళ్లు పత్రికల్లో స్పష్టంగా ప్రకటించారు. అమెరికాలో గల చట్టాలలో పేరుకు మాత్రం అందరికీ సమానహక్కులు కలిగించారు. కాని అక్కడకూడా బూకర్‌టి వాషింగ్టన్ వంటి ఉన్నతపాశ్చాత్య శిక్షణ పొందిన, సచ్చరిత్రుడైన క్రైస్తవుడు బూకరిటి పాశ్చాత్య సభ్యతను సంపూర్తిగా అలవరుచుకున్న పురుషుడు ప్రెసిడెంట్ రూజ్‌వెల్డ్ దర్బారులో అడుగుపెట్టలేక పోయాడు యివాళకూడా పోలేడు. అమెరికా యందలి హబ్షీలు పాశ్చాత్య నాగరికతను స్వీకరించి క్రైస్తవులుగా మారిపోయారు. అయినా వాళ్ల చర్మవు నల్లరంగు వాళ్ల దోషంగా పరిగణింపబడుతూవున్నది. ఆమెరికావంటి