పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

95


నేను భావించాను" అని చేంబర్లెన్ వారికి చెప్పాడు ఆయన చెప్పిన యీ మాటలు అగ్నిలో ఆద్యంపోసినట్లైంది. మీ. ఛేంబర్లేన్ ఏషియాటిక్ విభాగం చెప్పిన చిలకపలుకుల్ని వినిపించాడన్న మాట భారతదేశంలో వ్యాప్తమైయున్న గాలినే ఏషియయాటిక్ విభాగం వాళ్లు ట్రాన్స్‌వాల్‌లోవ్యాప్తం చేశారు గుజరాతీ (లేక భారతీయులు! వాళ్లకు తెలుసు ఇండియా యందు బొంబాయిలో వుండేవారిని ఆంగ్ల అధికారులు చంపారన్‌లో పరదేశీయులుగా భావిస్తూవుంటారు. ఆసూత్రం ప్రకారం ఏషియాటిక్ శాఖ వాళ్లు డర్బన్‌లో వుండేవాడికి ట్రాన్స్‌వాల్‌లో వుండే భారతీయుల్ని గురించి ఏమీ తెలియదని ఛేంబర్లేనుకు నూరిపోశారన్నమాట నాకు అక్కడి విషయాలు క్షుణ్ణంగా తెలుసునని ఏషియాటిక్ శాఖవారికి తెలిసియుండకపోవచ్చు. అసలు ట్రాన్స్‌వాల్ పరిస్థితులు ఎవరికి ఎక్కువగా తెలుసు అని అడిగితే అక్కడి భారతీయులు నన్ను అక్కడికి పిలిపించి ఒక విధంగా సమాధానం ఇచ్చివేశారు. అధికారం చలాయిస్తున్న వారికి బుద్ధికి సంబంధించిన వాదనలు సరిపోవు అను విషయం క్రొత్తదేమీకాదు. మి॥ ఛేలబర్లెన్ ఆప్పుడు అక్కడి ఆంగ్లేయుల ప్రభావంలో బాగా పడిపోవడమేగాక వాళ్లను తృప్తిపరచాలనే భావంతో వాళ్లు ఏంచెబితే అలా చేశారని స్పష్టంగా తేలిపోయింది యిక న్యాయం ఎలా చేస్తాడు. అయినా మిగిలియున్న ఒక్క మార్గాన్ని త్రోసి వేయకూడదనే భావంతో అక్కడి భారతీయ బృందం సభ్యులు వెళ్లి అతణ్ణి కలిశారు

నాకు 1894 నాటికంటే యిప్పుడు గడ్డుపరిస్థితి ఏర్పడింది. ఛేంబర్లేన్ దక్షిణాఫ్రికానుంచి వెళ్లిపోగానే, నేను దక్షిణాఫ్రికా వదిలి ఇండియా వెళ్లవచ్చునని భావించాను. కాని దక్షిణాఫ్రికాలో సేవాధర్మం అంటే ఏమిటో తెలుసుకున్న నేను అక్కడి భారతీయుల్ని వదలి ఇండియాకు వెళ్లి అక్కడి జనావళికి సేవచేస్తానని చెప్పడం ధర్మంకాదని అనిపించింది. యిక ఏదిఏమైనా ట్రాన్స్‌వాల్ యందలి భారతీయులపై విరుచుకు పడుతున్న పిడుగుల్ని అపివేయుటకు నేను యిక్కడ వుండి తీరాలనే నిర్ణయానికి వచ్చాను అందుకు యావజ్జీవితం దక్షిణాఫ్రికాలో వుండవలసి వచ్చినా వుండి తీరాలని కూడా అనుకున్నాను. ఈ విషయం జాతి సోదరులకు చెప్పాను. 1894లో