పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

యుద్ధం తరువాత


వలెనే యీసారి కూడా అక్కడ వుండుటకు నా జీవన నిర్వహణను గురించి కూడా వారికి చెప్పాను అక్కడి వారంతా వెంటనే ఆనందంతో అంగీకరించారు

నేను వెంటనే ట్రాన్స్‌వాల్‌లో వకీలు వృత్తి ప్రారంభించడానికి అనుమతికోరుతూ అర్జీ పెట్టుకున్నాను. నేటాలులో జరిగినట్లే యిక్కడి వకీళ్ల సంఘంకూడా నా అర్జీని వ్యతిరేకిస్తుందని భయపడ్డాను కాని అలా జరగలేదు. వకీలు వృత్తి సాగించుటకు అనుమతి పత్రం లభించింది జోహన్స్‌బర్గులో ఆఫీసు తెరిచాను ట్రాన్స్‌వాల్ రాజ్యమందలి జోహన్స్‌బర్గులో భారతీయులసంఖ్య అధికంగా వున్నది అందువల్ల వ్యక్తిగత ఆదాయం , ప్రజాసేవ రెండిటి దృష్ట్యా జోహన్స్‌బర్గుయే అనుకూలంగా వుంటుందని భావించాను ఏషియాటిక్ విభాగపు కుళ్లుకంపు, విజృంభించింది. వాళ్ల అవినీతికరమైన చర్యల చేదు అనుభవం అక్కడ రోజూ కలుగుతూవున్నది ట్రాన్స్‌వాల్ భారత మండలి ట్రాన్స్‌వాల్ బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ యొక్కశక్తి సామర్థ్యాలన్నీ ఆకుళ్లుకంపును ఆపుటకు సరిపోతున్నాయి. యిట్టి స్థితిలో 1885 నాటి చట్టమందలి 3వ నిబంధన వ్యవహారం మరుగున పడిపోసాగింది. ఏషియాటిక విభాగం రూపంలో ఉవ్వెత్తుగా ముంచుకొస్తున్న వరదతాకిడి నుంచి రక్షణ పొందడం మామొదటి లక్ష్యమైపోయింది భారతప్రతినిధి బృందం లార్డ్ మిల్నర్. అక్కడికి వచ్చిన లార్డ్ సెల్బర్న్, ట్రాన్స్‌వాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సర్ ఆర్థక్‌లాలీ. (వీరు ఆ తరువాత మద్రాసు గవర్నరుగా పనిచేశారు), వారిక్రింది అధికారులనందరినీ కలిసి జరుగుతున్న అన్యాయాల్ని ఏకరువుపెట్టి అర్జీలు దాఖలు చేసింది. నేను ప్రతిరోజూ చాలామందిని కలుస్తూనే వున్నాను అటనట కొద్దిగాఊపిరిపోసే మాటలు వినబడుతూ వుండేవి. అయితే అవన్నీ చిరిగినబట్టకు కుట్లు వేసినట్టుగా వుండేవి. దోపిడి దొంగలు యింట్లో జొరబడి మొత్తంకొల్లగొట్టి ఎత్తుకు పోతూ ఏడ్చి మొరపెట్టుకుంటే చివరికి దయతలిచి కొద్ది డబ్బు యజమాని ముఖానపారవేసి వెళ్లినట్లు, తెల్లదొరల వ్యవహారం వున్నది యిట్టి వ్యవహారాల వల్లనే గతంలో నేను వ్రాసిన యిద్దరు ఆఫీసర్ల మీద కోర్టులో కేసు నడిచింది. భారతీయుల ప్రవేశం విషయమై మొదట నేను వెల్లడించిన