పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

89


శతృసైన్యాల ముట్టడిలో చిక్కుకున్న ప్రతివాడికి సైనిక అధికారులు కొన్ని పనులు అప్పగించారు. అతి ప్రమాద కరము, అత్యంత సహాయకారి యగు పని పరభుసింగుకు అప్పగించారు. లేడీస్మిధ్‌కు బహుసమీపంలో గల ఒక ఎత్తైన కొండ మీద బోయర్లు పోంపోం అను పేరుగల పెద్ద ఫిరంగిని నిలిపి వుంచారు ఆ ఫిరంగి నుంచి వెలువడిన అనేక గుండ్లకు లేడీస్మిధ్ యందలి చాలా భవనాలు కూలిపోయాయి. చాలా మంది జనం ప్రాణాలు కూడా కోల్పోయారు. ఫిరంగి నుంచి గుండు బయటికి వెలువడి, గురి చూచిన చోట పదడానికి ఒకటి రెండు నిమిషాల సమయం పడుతుంది. గుండు వెలువడిందని తెలిస్తే ఆ కొద్ది సమయంలో అది పడే చోటున వున్న జనం రక్షణ స్థావరాలకు చేరి ప్రాణం కాపాడుకోవచ్చు. పరభుసింగుకు అత్యంత ప్రమాదకరమైన ఆ పని అప్పగించారు. అతడు ఫిరంగి పై దృష్టి నిలిపి ఒక్క చెట్టు క్రింద కూర్చొని వుండేవాడు. ఫిరంగి గుండు మ్రోగగానే పెద్ద గంట మ్రోగించమని అతడికి ఆదేశం యివ్వబడింది. ప్రాణాలకు ముప్పు కలిగించే ఫిరంగి గుండు వెలువడగానే హెచ్చరిక గంటగణగణ మ్రోగేది వెంటనే జనం తమ తమ రక్షణ కేంద్రాలకు పరుగిడి అక్కడ దాక్కొని ప్రాణాలు కాపాడుకునే వారు పిల్లిని చూడగానే ఎలుకలు తెగబడి అటోయిటో పరుగెత్తి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించినట్లుగా అక్కడి జనం గంట మ్రోతవినపడగానే వ్యవహరిస్తూ వుండేవారు పరభుసింగ్ చేసిన యీ అత్యద్భుత సేవా కార్యాన్ని ప్రశంసిస్తూ, లేడీస్మిద్ యందలి సైనికాధికారి “పరభుసింగ్ నిష్ఠాగరిష్ఠుడు. ఒక్క సారైనా అతడు తన కర్తవ్య నిర్వహణలో ఏమరుపాటు చూపలేదు " అని పొగిడి ఆదరించాడు పరభుసింగ్ ప్రాణాలకు అక్కడ అసలు రక్షణ లేదు. అయినా ప్రాణాలకు తెగించి అతడు చేసిన యీ ఘనకార్య సమాచారం నేటాలునందేగాక, అనాటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ చెవులదాకా వెళ్లింది కర్జన్ పరభుసింగ్ గౌరవార్థం ఒక కాశ్మీరు అంగరఖా పంపించాడు పరభుసింగ్ సేవా కార్యాన్ని అత్యధికంగా ప్రచారం కావించి, కారణం ప్రకటించి, పరభుసింగకు యీ అంగరఖాను ప్రదానం చేయమని అంగరఖాతో బాటు పత్రం కూడా పంపించాడు. యీ