పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

బోయర్ యుద్ధం


పని డర్బన్ సగర్ మేయరుకు అప్పగించబడింది. అతడు డర్బన్ నగర మందలి టౌన్ హాలు కౌన్సిల్ చేంబరులో బహిరంగ సభ జరిపి పరభుసింగ్‌కు ఆ అంగరఖాను కానుకగా సమర్పించాడు యీ ఘట్టం వల్ల ఏమనిషిని తేలికగా చూడకూడదు తుచ్చుడని భావించ కూడదు మరియు ఎంత పిరికిపంద అయినా అవసరం వచ్చినప్పుడు వీరుడైపోగలడు' అను రెండు విషయాలు మనకు బోధపడతాయి




10

యుద్ధం తరువాత

1900 నాటికి బోయర్ యుద్ధం ముగిసింది లేడీస్మిధ్, కింబర్లీ, మెఫేకింగ్‌కీలను బోయర్ సైన్యాల చేతుల నుంచి బ్రిటిష్‌వాళ్ళు విడిపించారు జనరల్ క్రోన్జే పారడీబర్గ్‌లో ఓడిపోయాడు బోయర్లు జయించిన బ్రిటిష్‌వారి భూభాగమంతా తిరిగి బ్రిటిష్ సామ్రాజ్యం క్రిందకు వచ్చింది. లార్డ్‌కిచనర్ ట్రాన్స్‌వాల్ ఫ్రీస్టేట్‌లను కూడా తమ అధీనంలోకి తెచ్చుకున్నాడు. యిక గొరిల్లా పోరాటాలు మాత్రమే మిగిలాయి

దక్షిణాఫ్రికాలో నా పనిపూర్తి అయిందనే నిర్ణయానికి వచ్చాను ఒకనెల రోజులు వుండాలని వెళ్లిన నేను ఆరుసంవత్సరాలు అక్కడ వుండిపోయాను కార్యక్రమ రూపురేఖలు స్థిరపడ్డాయి. అక్కడి ప్రజల అంగీకారం లేకుండానే నేను భారతావనికి తిరిగి రావడం కష్టమైపోయింది. నేను భారతదేశం వెళ్లి అక్కడ ప్రజానీకానికి సేవ చేస్తానని అనుచరులకు తెలియజేశాను దక్షిణాఫ్రికాలో నేను స్వార్థంవదిలి సేవాధర్మాన్ని నేర్చుకున్నాను. సేవాధర్మంయెడ నాకుగల మక్కువ బాగా పెరిగింది. శ్రీమనసుఖలాల్‌నాజర్ దక్షిణాఫ్రికాలో వున్నారు శ్రీ ఖాన్‌కూడా అక్కడ వున్నారు. దక్షిణాఫ్రికానుంచి కొద్ది మంది యువకులు ఇంగ్లాండు వెళ్లి బారిష్టరుపట్టా పుచ్చుకొని వచ్చారు. అట్టి స్థితిలో నేను అక్కడి నుంచి భారతీయులు ఒక్క షరతు పై భారతదేశానికి వెళ్లవచ్చునని చెప్పారు. అనుకోళుండా భారతజాతి ఆపదలో చిక్కుకుంటే మేము