పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

బోయర్ యుద్ధం


చిక్కుకున్నప్పుడు కోపతాపాలు అసూయా ద్వేషాలు విస్మరించి భారతీయులు ప్రాణాలకు తెగించి తమ జాతికి చేస్తున్న సేవల్ని చూచి ఆ సమయంలో వాళ్లంతా ఆనందంతో పొంగిపోయారు. జనరల్ బులర్ పత్రాల్లో మా సేవల్ని ప్రశంసించిన విషయం ముందే వ్రాశాను. మా 37 మంది భారతీయ నాయకులకు పతకాలు కూడా బహూకరించారు

లేడీస్మిద్ యందలి ఆంగ్లేయుల పటాలాల్ని, బోయర్ల దాడి నుంచి రక్షించిన తరువాత జనరల్ బులర్ యుద్ధకార్యక్రమం ముగిసింది. అందుకు రెండునెలల సమయం పట్టింది. అప్పుడు మా దళం, ఆంగ్లేయుల దళం రెండిటికీ ముక్తి లభించింది. తరువాత కూడా యుద్దం చాలా కాలం సాగింది మళ్లీ వెళ్లడానికి మేమంతా సిద్ధంగా వున్నాం అంతపెద్ద యుద్ధం మళ్లీ జరిగితే మీ సహకారం ప్రభుత్వానికి అవసరం అప్పుడు కబురు పంపుతామని అధికారులు మాకు జాబు పంపారు

దక్షిణాఫ్రికాలో జరిగిన యుద్ధంలో భారతీయులు పాల్గొని చేసిన పని సామాన్యమైనదే ప్రాణనష్టం కూడా ఏమీ జరగలేదు. అయినా ప్రాణాలకు తెగించి చేసిన సేవా ప్రభావం మాత్రం అమితంగా తెల్ల వారి మీద పడిందని చెప్పవచ్చు. భారతీయులు యుద్ధంలో పాల్గొని ఆంగ్లేయులకు సహాయం చేస్తారని కలలో సైతం ఎవ్వరూ ఊహించని తరుణంలో, అలా జరగడం వల్ల మంచి ప్రభావం అమితంగా తెల్లవారి హృదయాలపై పడింది. దాని విలువ కూడా బాగా పెరిగింది. బోయర్ యుద్ధం ముగిసేంతవరకు తెల్లవారి హృదయాలలో భారతీయులయెడ కృతజ్ఞతాభావం నిండి యున్నదనుట యదార్ధం

ఈ ప్రకరణాన్ని ముగించే ముందు ఒక అవిస్మరణీయ ఘట్టాన్ని గురించి యిక్కడ చెప్పడం అవసరం లేడీస్మిద్ బోయర్ల చేతుల్లో చిక్కినప్పుడు ఇంగ్లీషు వాళ్లతో బాటు కొద్దిమంది భారతీయులు కూడా అక్కడ వున్నారు వారిలో కొందరు వ్యాపారులు, మిగతావారు గిర్‌మిటియా కార్మికులు. బట్టి కార్మికులు కొందరు రైల్వేలో పని చేస్తున్నారు. కొందరు ఆంగ్లేయుల యిండ్లలో నౌకర్లుగా వున్నారు. ఒక గిర్‌మిటియా కార్మికుని పేరు పరభుసింగ్