పుట:తెలుగు వాక్యం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

66

తెలుగు వాక్యం

ఈ ఆర్థంలో వాక్యాలు వ్యాకరణ విరుద్ధాలు , కాకపోయినా, అంత సహజంగా కనపడటం లేదు.

f. ఆమె సిగ్గుపడటంతోటే నేను బయటికి వెళ్ళాను.
e. అతను సందేహించటంతోనే నేను చెప్పటం మానేశాను.
h. సుజాత విచారించటంతోటే భర్త ఓదార్చాడు .

భావార్థకనామం + తోనే, తోటే అని ప్రయోగించిన వాక్యాలు ఆన్నంత క్రియ + గానే ఆనే అసమాపక క్రియ ఉన్న వాక్యాలతో సమానార్థకాలవుతై.

(176)

a. ఆమె అన్నం తినటంతోనే నిద్రపోతుంది.
b. ఆమె అన్నం తినగానే నిద్ర పోతుంది.

భావార్థక నామంతో కేవలం తో అనే శబ్దం మాత్రమే ప్రయోగించినప్పుడు ప్రధానక్రియలో వ్యాపారానికి హేతువు (? దోహదకారి) అవుతుంది.

(177)

a. జ్వరం రావటంతో ఆమె మూలబడ్డది.
b. ఎవరూ గదమాయించే వాళ్ళు లేకపోవటంతో పిల్లల అల్లరి
ఎక్కువయింది.
c. కార్మికులు సమ్మె చెయ్యటంతో ఫ్యాక్టరీ మూతబడింది.

2.728 : కొన్ని ప్రాంతాల్లో కొన్ని అర్థాల్లో అటమంత రూపాలకు బదులు తచ్ఛబ్ద (అది > ది) నామ్నీకరణ రూపాలు వాడతారు. ప్రత్యేక కాలబోధ లేని క్రియాజన్య విశేషణంమీద అది అనే శబ్దంలో మొదటి అచ్చులోపించగా మిగిలిన ది రూపం చేర్చటంవల్ల ఈ నామం ఏర్పడుతుంది.

a. మీరు వచ్చేది ఎప్పుడు?
b. నలుగుర్లోకి వచ్చేదానికి ఆమె సిగ్గుపడుతుంది.
c. ఆమె హస్కు కొట్టేదానికి పక్కింటి కెళ్ళింది.
d. వాడికి తినేదానికి టైం లేదు.

2.73 : తచ్చబ్దనామ్నీకరణం : క్రియాజన్య విశేషణం నామ్నీకరణంలో ఉపయోగించే పద్ధతిని కొంత విభక్త్యర్థక నామ్నీకరణంలో చూశాం. అక్కడ ఒక వాక్యంలో ఏదైనా నామాన్ని ఉద్దేశ్యంగా చేయదల్చుకున్నప్పుడు ఆ నామానికి