సంశ్లిష్ట వాక్యాలు
67
మొత్తం వాక్యం విశేషణంగా ప్రవర్తించటం గమనించాం. మొత్తం వాక్యాన్ని వాక్యాంతర్భాగమైన నామానికి విశేషణం చేసినప్పుడు వాక్యంలో కాలబోధననుసరించి క్రియ విశ్లేషణ రూపాన్ని గ్రహిస్తుంది. వాక్యంలో క్రియ ప్రధానం కాబట్టి క్రియ విశేషణంగా మారిందంటే వాక్యమే విశేషణంగా మారినట్టు.
2.731 : అట్లాకాకుండా మొత్తం వాక్యాన్నే ఒక నామబంధంగా ప్రయోగించినప్పుడుకూడా క్రియాజన్య విశేషణం ప్రయుక్త మవుతుంది. అప్పుడు క్రియాజన్య విశేషణం ఏ నామానీకీ విశేషణం కాక అది అనే శబ్దాన్ని గ్రహించి నామంగా మారుతుబది. ఏ విశేషణం తరవాతైనా అది అనే శబ్దంలో ప్రథమ స్వరలోపం జరిగిం ది అనే రూపంతో ఉంటుంది. మంచి + అది > మంచిది, వచ్చే + అది > వచ్చేది. తెలుగులో అది అనే శబ్దానికి బహుళార్థాలూ, వివిధ ప్రయోజనాలో ఉన్నై. ఈ నామ్నీకరణంలో అది అంటే వాక్యంలో చెప్పిన విషయ సర్వస్వం అని అర్థం. ఈ కింది వాక్యాల్లో తచ్ఛబ్ద ప్రయోగాన్ని చూస్తే ఈ విషయం గ్రహించవచ్చు.
(178) | a. సుబ్బారావు మీతో పోట్లాడింది నాకు తెలుసు. | |
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. సమాపక క్రియల్లో చూపించే కాలబోధకతకూ, క్రియాజన్య విశేషణ రూపాలకు ఏకైక సంబంధం (one to one correspondence) లేదు. ఉదాహరణకు వ్యతిరేకంలో ఒకే ఒక్క రూపం ఉంటుంది. ఏ కాలంలో అయినా ఆ ఒక్క రూపాన్నే అన్వయించుకోవాలి.
(179) | సుజాత (నిన్న, ఇవాళ, రేపు) మీటింగుకు రానిది నాకు తెలుసు. | |
పై వాక్యంలో రానిది అనే నామ్నీకృత రూపానికి పూర్వరూపం “రాలేదు, రావటం లేదు, రాదు" అనే వాటిల్లో ఏదైనాకావచ్చు. వచ్చేది అనే నామ్నీకృత రూపానికి 'వస్తున్నది, వస్తుంది' అనే రూపాల్లో ఏదైనా మూలరూపంకావచ్చు.
2.732 : క్రియలేని వాక్యాలను ఇట్లా నామ్నీకరించాలంటే ఆ వాక్యాలకు అవు (<అగు) ధాతువును అనుబంధించాలి. కాలాదిక బోధలోకూడా అగు ధాతువును