Jump to content

పుట:తెలుగు వాక్యం.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

65

2.72713 : ప్రధాన వ్యాపారం స్థితిబోధకమైనప్పుడు కి విభక్తి పరమైన భావార్థకనామం పై రెండు అర్థాలకన్నా భిన్నమైన అర్థంలో కనిపిస్తుంది. ఈ అర్థంలో వాక్యం మొత్తాన్ని అస్త్యర్థక క్రియకు కర్తగా భావించవచ్చు.

(173)

a. అతనికి మనుష్యులతో మాట్లాడటానికి (time) టైం లేదు.
b. నాకు రాసుకోటానికి తీరిక ఉండటం లేదు.
c. కాలేజిలో చదువుకోటానికి వీలుండదు.

పై వాక్యాలన్నిటిలో ప్రధానవాక్యంలో కర్తతోగాని, అనుభోక్తతోగాని, ఉపవాక్యంలో కర్త అభిన్నమయి ఉండాలి.

2.7272 : అధికరణార్థకమైన లో, మీద అనే విభక్తులతో భావార్థక నామం ప్రయోగించినప్పుడు కూడా ఈ నియమం వర్తిస్తుంది.

(174)

a. నిద్రపోవటంలోనే అతను రోజంతా గడుపుతాడు.
b. కష్టపడటంలోనే సౌఖ్యముంది.
c. భావకవులకు ఏడవటంలోనే సుఖముంది.

2.7273 : భావార్థకం తరవాత తో వస్తే పూర్వ వ్యాపార సమాప్తిని, పరవ్యాపారారంభాన్ని తెలియజేస్తుంది. కేవలస్థితి బోధక ఆఖ్యాతాలనించి, నిష్పన్న మైన అటమంత రూపాలు ఈ అర్థంలో ప్రయోగ యోగ్యాలు కావు. ఈ అర్థంలో తో తోటి అనే రూపంలో రావచ్చు. సాధారణంగా ఈ రూపంమీద ఏ వార్థకమైన శబ్దం వస్తుంది. ఈ వాక్యాల్లో ఏకకర్తృక నియమం లేదు.

(175)

a. అమె అన్నం తినటంతోటే నిద్రపోతుంది.
b. నన్ను చూడటం తోటే వాడి మొహం తెల్లబడ్డది.
c. పిల్లలు క్లాసుకి రావటం తోటే టీచరు పాఠం మొదలు పెడుతుంది.
* d. ఆమె అందంగా ఉండటంతోటే అతను పెళ్ళికొప్పుకున్నాడు.
* e. ఆమెకు తలనొప్పిగా ఉండటంతోటే నేను వెళ్ళాను.

పై వాక్యాలు (d, e) లు వ్యాకరణ విరుద్ధం కావటానికి నామ్నీకృతాఖ్యాతం స్థితిబోథకం కావటమే. మనోవ్యావార బోధక క్రియలతో నామ్నీకరించినప్పుడు