పుట:తెలుగు వాక్యం.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంశ్లిష్ట వాక్యాలు

55

మూల వాక్యార్థాల్ని వ్యక్తం చెయ్యలేక పోతున్నై. (a), (c) లో వ్యక్తం చెయ్య గలుగుతున్నై. ఇందుక్కారణం లో, మీద అనేవి సామాన్య (Unmarked) అధికరణాన్ని బోధిస్తై. అంతేకాక ఇవి ఆధారాధేయాల సంశ్లేషను కూడా సూచిస్తై. ఆధారాధేయాల సంశ్లేషబోధ ఉన్న విభక్తులతోనే అధికరణలో నామ్నీకరణం సాధ్యమవుతుందని సూత్రించుకోవచ్చు.

లో, మీద వైషయికాధికరణలో కూడా ప్రయుక్తమవుతై. ఆ ఆర్థాల్లోను నామ్నీకరణం సాధ్యమవుతుంది

(154)

a. మంత్రిగారికి సాహిత్యంలో ప్రవేశం ఉంది.
               → మంత్రిగారి ప్రవేశము ఉన్న సాహిత్యం.

b. సుజాతకు నైలెక్సు చీరల మీద మోజు ఉన్నది.
              → సుజాతకు మోజున్న నైలెక్సు చీరలు.

కాలార్థంలో లో ప్రయోగించినప్పుడు నిష్పన్న నామబంధంలో విశేష నామానికి బదులు సామాన్యనామం వస్తుంది.

(155)

మాకు 1959 లో పెళ్లి అయింది
            → మాకు పెళ్లి అయిన సంవత్సరం.
             * మాకు పెళ్లి అయిన 1959.

2.716 : ఈ విభక్త్యర్థక నామ్మీకరణంలో గమనించాల్సిన విశేషం ఇంకోటి ఉంది. నేను తిన్న అన్నం అనే నామబంధంలో కర్తృబోధక శబ్దాన్ని తీసేసి తిన్న అన్నం అన్నా తిను అనే క్రియకు, అన్నం అనే నామానికి ఉన్న వ్యాకరణ సంబంధాల్లో మార్పురాదు.

నేను చంపిన పులి అనే నామబంధంలో పులి చంపు అనే క్రియకు కర్మ. అందులో నుంచి నేను శబ్దాన్ని తొలగించి, చంపిన పులి అంటే పులి అనే శబ్దాన్ని కర్మగా కాక కర్తగా అర్థం చేసుకుంటాం.

అట్లాగే నేను డబ్బుపెట్టిన పెట్టె అనే నామబంధంలో పెట్టె అనే నామం పెట్టు అనే క్రియతో అధికరణ కారక సంబంధంలో ఉంది. డబ్బు అనే పదం తీసేసి నేను పెట్టిన పెట్టె అంటే పెట్టె ను కర్మకారకంగా అర్థం చేసుకుంటాం.