పుట:తెలుగు వాక్యం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

తెలుగు వాక్యం

దీన్నిబట్టి అధికరణ, కర్మ, కర్తృ కారకాల్లో ఉత్తరోత్తరం బలీయమని తెలుస్తుంది. ఒక నామ పదానికి క్రియతో ఒకటికన్నా ఎక్కువ కారక సంబంధాలుండే అవకాశం ఉన్నప్పుడు పూర్వకారక బోధక పదాభావంలో ఉత్తరోత్తర కారకార్థానికే ప్రాధాన్య మెక్కువని గ్రహించవచ్చు. భిన్నకారక సంబంధాలుండే పదాలు దొరికినప్పుడు మిగతా కారకాలకు కూడా ఈ అంతరువుల్లో స్థిరస్థానం కలిగించ వచ్చు.

2.717 : సమాసాలనుకూడా ఈ విధమైన నామ్నీకరణాల నుంచి నిష్పన్నం చెయ్యవచ్చు. ఉదాహరణకు: మాకు ఇల్లుందిమాకున్న జల్లుమా ఇల్లు. కాని సమాసాల్లో క్రియ లోపించటం వల్ల బహుళార్థ బోధకాలవుతై . ఉదాహరణకు ప్రభుత్వ కవులు అనే సమాసానికి “ప్రభుత్వంలో ఉద్యోగం చేసే కవులు", "ప్రభుత్వం పోషించే కవులు", "ప్రభుత్వం కోసం రాసే కవులు", “ప్రభుత్వం అభిమానించే కవులు" ఇట్లా చాలా అర్థాలు రావచ్చు. ఈ అర్థాలు అప్పటి సామాజికుల అలవాట్లనుబట్టి ఉంటై. సమాజంలో వచ్చే మార్పుల్ని బట్టి సమాసాల అర్థాలుంటై. ఉదాహరణకు నేడు వాడుకలో ఉన్న వంటింటి పత్రికలు, రేడియో కవులు, రేడియో నాటికలు, పండగ కవులు, విప్లవకవులు ఇట్లాంటివే. పండగల ప్రత్యేక సంచికలకు కవిత్వం రాసేకవులు అనే అర్థంలో ఇటీవల సాహిత్య విమర్శలో పండగ కవులు అనే సమాసం వాడుకలో ఉంది. 'విప్లవ కవిత్వం రాసే కవులు' అనే అర్థంలో విప్లవ కవులు అనే సమాసం వాడుకలో ఉంది. ఈ సమాసాలను వ్యాకరణ ప్రక్రియద్వారా వాక్యం నుంచి నిష్పన్నం చెయ్యటం కష్టం.

2.718 : విభక్త్యర్థక నామ్నీ కరణంలో అన్ని రకాల అర్థాలలో నామ్నీ కరణం సాధ్యం కాదని తెలుసుకున్నాం. ఇదే పనిని చాలా అర్థాల్లో చేసే వ్యాకరణ ప్రక్రియ యత్తదర్థక వాక్యప్రయోగం. విభక్త్యర్థక నామ్నీకరణం ద్రావిడ భాషల్లో ప్రచురం, ఆర్యభాషల్లో విరళం, (ఒరియా, బెంగాలీ భాషల్లో విభక్త్యర్థక నామ్నీ కరణం విస్తారంగానే ఉంది.) ఆర్యభాషల్లో యత్తదర్థక వాక్య ప్రయోగం అధికం. ఈ కింది వాక్యాల్లో యత్తదర్థక ప్రక్రియను చూడవచ్చు.

(156)

a. నేను ఒక అమ్మాయితో సినిమాకు వెళ్లాను.
 → నేను ఏ అమ్మాయితో సినిమాకు వెళ్లానో ఆ అమ్మాయి.