పుట:తెలుగు వాక్యం.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

తెలుగు వాక్యం

ఉంటుంది. ఈ కాలాలకు వ్యతిరేక బోధకూడా ఉంటుంది. భూతకాల వ్యతిరేకబోధ అన్నంత క్రియకు అన్ని పురుషలలోను లేదు అనే రూపం చేర్చటంవల్ల ఏర్పడుతుంది. వర్తమాన వ్యతిరేకక్రియ భావార్ధకరూపానికి లేదు అనేరూపం చేర్చటంవల్ల ఏర్పడుతుంది, భవిష్యద్ వ్యతిరేకక్రియ అన్నంతరూపానికి క్రియావిభక్తులు చేర్చటంవల్ల ఏర్పడుతుంది. వీటి నిర్మాణ విశేషాలు పద నిర్మాణచర్చలో భాగాలు కావటంవల్ల ఇక్కడ విశేషించి చెప్పలేదు.

1:241 ప్రశ్నార్ధక వాక్యాలు రెండురకాలు. విశేష విషయాపేక్షకాలు, విశేషవిషయ నిరపేక్షకాలు. క్రియారహితవాక్యాల గురించి చెప్పినవుడు పేర్కొన్న ప్రశ్నలు విశేషవిషయ నిరపేక్షకాలు. అవి వాక్యాంతంలో ఆ అనే రూపాన్ని చేర్చటంవల్ల ఏర్పడతాయి. విశేషవిషయాపేక్షకాలు ప్రత్యేకపదార్ధకపదంద్వారా వ్యక్తమవుతాయి. ఈ రకపు ప్రశ్నలు ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎవరు, ఏమిటి మొదలైన రూపాలవల్ల ఏర్పడతై. ఈ పదాలు క్రియకు సన్నిహితంగా పూర్వస్థానంలో వస్తై. ఈ కింది వాక్యంలో ఈ ప్రశ్నాభేదాలు ఉదాహరించబడుతున్నై.

(22)

a. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందా ?
b. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది ?

విషయాపేక్షక ప్రశ్నలలో ఏ విషయాన్ని ప్రశ్నించినా ఆ ప్రశ్నపదం క్రియకు సన్నిహితంగా చేరుతుంది. అంటే ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు. ఎవరు, మొదలైన ప్రశ్న పదాలు ఈ రకపు ప్రశ్నలలో క్రియాపదానికి పూర్వం సన్నిహిత స్థానంలో ఉంటై. వాక్యం మొత్తాన్ని ప్రశ్నించే అనే రూపం వాక్యాంతంలో చేరుతుంది. అనే రూపం వాక్యంలో ఇతర పదాలకుకూడా చేరవచ్చు. అట్లా చేరినపుడు వాక్యంలో క్రియ నామ్నీకృతమవుతుంది. ఆ క్రియకు పురుషబోధతో నిమిత్తం లేకుండా 'ది' అనే ప్రత్యయం చేరుతుంది. ఈ ప్రక్రియాగతిని . క్రింది వాక్యాలలో చూడవచ్చు

(23)

అతను ఊరికి వెళ్ళాడు -- a. అతనా ఊరికి వెళ్ళింది.
                                  b. అతను ఊరికా వెళ్ళింది.

1.242 విధ్యర్ధబోధక క్రియలలో కర్త ఎప్పుడు మధ్యమ పురుష సర్వ