పుట:తెలుగు వాక్యం.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సామాన్య వాక్యాలు

11


(21)

a. నాకు ఆకలిగా ఉంది.
b. నాకు ఆకలి అవుతున్నది.
c. నాకు దప్పికగా ఉంది.
d. నాకు దప్పిక అవుతున్నది.
e. నాకు తలనొప్పిగా ఉంది.
f. నాకు తలనొప్పి వేస్తున్నది.

ఈ పై వాక్య సమూహంలో సరివాక్యాలలో ఉద్దేశ్యపదానికి, క్రియాపదానికి మధ్యనున్న పదాన్ని కర్తృపదంగా గుర్తించవచ్చు. అయితే ఇది వ్యక్తనిర్మాణపు కర్త (surface subject). గుప్త నిర్మాణం (deep-structure) లో కర్తను గుర్తించవలసిన అవసరం ఉందో లేదో చెప్పటం వెంటనే సాధ్యంకాదు. ఒకవేళ అట్లా చెప్పితే అనుభోక్తనే కర్తగా చెప్పాల్సి రావచ్చు. ఈ పై వాక్యాలలోకూడా అనుభవ బోధక నామాలు దేహ, మనఃస్థితి బోధకాలే కావటం విశేషం. ఈ రకమైన వాక్యాలు ఇంకా పరిశీలనకు లొంగలేదు.

1.23 ఆఖ్యాతబంధంలో ప్రధానమైనది క్రియా పదం. ఈ క్రియాపదం ద్వారానే కాలబోధకత వ్యక్తమవుతుంది. కాలబోధను స్థూలంగా భూత, భవిష్యత్, వర్తమానాలుగా విభజించవచ్చు. ఆయా కాలాలలో కాలబోధను సూచించే ప్రత్యయాలు చేరతై. కాలబోధక ప్రత్యయాల తర్వాత కర్తృపదంలో ఉన్న లింగ పురుష వచన భేదాన్ననుసరించి క్రియావిభక్తులు చేరతై, నేటి , తెలుగులో భవిషద్బోధ, తధ్ధర్మబోధ ఒకే క్రియద్వారా జరుగుతుంది. “అతను మాంసం తింటాడు" అనే వాక్యంలో తింటాడు అనే క్రియకు వేరే పదసహాయం లేనప్పుడు 'అతను ఎప్పుడూ మాంసాహారే' అనిగాని, 'అతను ఇక ముందు మాంసం తింటాడు' - అనిగాని అర్థాలు కావచ్చు. తెలుగులో వర్తమానార్ధక క్రియ శత్రర్థక బోధకంకూడా అవుతుంది. శత్రర్ధకబోధ ఇతరకాలాలలో చెప్పాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన కాలబోధ ఇతర పదాలద్వారా చెప్పాల్సి ఉంటుంది. ఏ పదసహాయమూ లేనపుడు ఈ క్రియ వర్తమానార్ధకమే అవుతుంది. అతను వస్తున్నాడు అనే వాక్యానికి ఇతర పదాల సహాయమూ, వాక్య ప్రయోగ సందర్భ సహాయము లేనప్పుడు అతను ఇప్పుడు వస్తున్నాడు అనే అర్ధం చెప్పాల్సి ఉంటుంది. ఇతర కాలాల బోధలో ఆ కాలాల్ని సూచించే నిన్న, మొన్న, రేవు, ఎల్లుండి వంటి పదాల అవసరం