పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్వగ్విద్వన్మహాసభ.

(ప్రకాశముగా) అపరాధం వచ్చింది క్షమించండి

వరా-మనలో మనకు తగవులు కూడదు. మీరే అగ్రసభావతులు. మే మందరమూ ఒప్పుకున్నాము. శాంతించి కూర్చోండి.

వ్యాఘా-ఆలాగయితే సరే.

ఆశ్వ-మీరు యిందాకా చెప్పిన ధర్మశాస్త్రం మనుష్యుల విషయమా? తిర్కగ్జాతుల విషయమా?

అంజ---అందరివిషయమూను. లోకంలో మనుష్యులకు వక్కధర్మశాస్త్రమూ పశువులకు నక్కధర్మశాస్త్రమూ వుంటుందా? అందరికీ వక్కటే ధర్మ శాస్త్రం.

మేషే--- మీధర్మశాస్త్రం చచ్చినవాళ్ళ విషయంలో నా? బ్రతికివున్న వాళ్ళవిషయంలోనా?

అంజ----ఓహోహు! మీరుకుళ్ళంకలు మహాచేస్తూవున్నారే! ఇది అందరివిషయంలోనూ. బ్రతికివున్నవాళ్ళ ప్రాయశ్చిత్తం ఛేసుకొమ్మంటే చేసుకోరు గనుక ముఖ్యముగా చచ్చినవాళ్ళ విషయంలోనే.

మేషే--- ఆలాగయితే చచ్చినవాళ్ళచేత ప్రాజాపత్యవ్రతం యిట్లాచేయిస్తారు?

తిమ్మ-- సభవారి యిష్టంవచ్చినట్లు చేయిస్తారు. అదంతా మీకెందుకు? సభవారు యేమి సెలవిస్తే అదే మాకు ధర్మశాస్త్రం.

అశ్వ--- సింహ శరభ గండ భేదుండాదులైన వుత్తములు వుపేక్షచేసి వూరుకోవడం చేత కోతులయొక్క కొండముచ్చులయొక్కా ఆటలు సాగుగుతూవున్నవి. మీ