పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ . 129

మనకు నచ్చినట్టల్లా చేయించడానికి ఐది నోరు వచ్చిన చెవులపిల్లుల యిల్లనుకున్నారా? మేము యిద్దరమూ తలచుకుంటే యీ దౌర్జన్యం చేసే వారిని డొక్కలు బద్దలయ్యేటట్టుగా తన్ని పడపొడిచి వదిలి పెడుతాము.

వృష:---తొందరపడకండి ఆంజనేయ శర్మగారూ! మీరుచెప్పిన ధర్మశాస్త్రంలో'కపీర ' అని వున్నది గనుక యిప్పుడీసభవారి కందరికి ప్రాయశ్చిత్తమక్కరలేదా? ఖరీంచ, అని వున్నది గనుక, గార్ధభేంద్రశాస్ర్తిగారికికూడా ప్రాయశ్చిత్తంకావలెను. సూరకవి, అనికూడా వున్నందున, సభాపతులైన వరహాభట్లుగారి కీప్రాయశ్చిత్తం జరగవలసినదే.

అంజ---(తనలో) వీళ్ళకు సంసృతం తెలియడం చాలా తంటాగా వున్నదే. (ప్రకాశముగా) బ్రతికివుండాగా మనకాసంగతి ఆలోచించవలసిన పనిలేదు. చచ్చిపోయిన తరువాత ధర్మశాస్త్రాలుతీసి, అందరినీ యిలాగే చేస్తాము, మగవాళ్ళు కావడంచేత తమకడుపులో నుంచి పిల్లలు పుట్టరుగనుక వీరు మేమాపాపంచెయ్యనే లేదంటారు. వక్క అబద్దమాడితే అన్నీమాసి పోతవి. రహసంలో జరిగే దానికి మనం యేమీ యిలాకా పుచ్చుకోకూడదు.

వృష---ఇరివరదాకా వ్యర్ధమైన ప్రయాసపడ్డారు. మేము మొట్టమొదట దహన విషయంలో వేసిన ప్రశ్నకు సభవారివద్దనుంచి యేమీసమాధానం రాలేదు.

వ్యాఘ్రా--- తగినన్ని దహనాలుచేస్తే దహనం చెయ్యవచ్చును. మొదట వుత్క్రాంతి గోదానం చెయ్యవలెను. తరువాత వైతరణీ గోదానం చెయ్యవలెను. సంచయన్నవాడు వకగోదానం చెయ్యవలెను. దశాహంనాడు వకగొదానం చెయ్యవలెను. మాసికిం నాడు వకటి చెయ్యవలెను. దశాహంనాడు వక గోదానం చెయ్యవలెను. మాసికంనాడు వకటి చెయ్యవలెను. ఈగోదానాలన్నీ నాకు యిప్పిస్తే యేప్రాయశ్చిత్తమూ అక్కరలేకుండా నేను ధహనం చేయిస్తాను. ఏమయ్యా సభాపతులు మీఅభిప్ర్రాయం చెప్పండి.

వరా--మాకు తగినదానాలు యిప్పిస్తే మేమూ వప్పు కుంటాఘు-

బక--వరాహభట్లగారితో నేనూ యేకీభవిస్తాను.-

రామ--(రహస్యముగా) దీస్ఖితులూ! కొంపమునుగుతూవున్నది. మనం యిందులో వప్పుకోకూడదు. పైకి యేమైనా అంటే వ్యాఘ్రావధానులు చంపివేస్తాడు.

కొంక--(రహస్యముగా) నాకూఅడేభయముగా వున్నది. అతనువక్కడు మనపక్షంలో చేరితే యెంతపనిఅయినా చేరుము. మేనమామ మార్జాల పంతుల అందులో వుండడంచేత వ్యాఃఘ్రావధానులు వాళ్ళల్లో చేరినాడు. ఇప్పుడాపక్షంలో