పుట:తిర్యగ్విద్వన్మహాసభ మరియు మూషకాసురవిజయం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిర్యగ్విద్వన్మహాసభ- 127

మార్జా---(తనలో) నాకువిశ్వాసం లేదంటూవున్నడు. యిందులో నెనువిశ్వాసం కలిగివుంటాను. (ప్రకాశముగా) ఓరి కర్కటాధమా! కావలిస్తే నీకు నేను ప్రాయశ్చిత్తం చేయిస్తాను.

భైర---వోరికోతిముండాకొడకా! నన్ను ముట్టుకోవడానికీ అర్హంకాదుట్రా నీధిలోకిరా, నీకండలు వూడదీసి నేనుముట్టు కోవడానికి తగిన వాణ్ని అవుదునో కానో చూపిస్తాను.

అంజ---శాస్తుర్లుగారూ1 ఆదౌర్జన్యం చిత్తగిస్తూవున్నారా? వృషభేంద్రరావుగారున్ను, అశ్వపతిగారున్ను, గడ్డితినే మాటలంటూవుంటే వూదుకోడం సఃభవారికి న్యాయమేనా?

గార్ధ---అశ్వపతిగారూ! వృషభేంద్రరావుగారూ! వూదుకోండి. మనంకార్యవాదులం తొందరపడ కూడదు. వారి ఢర్మశాస్త్రం చూపిస్తూవుండగా మరివకలాకూనడం మనకు భావ్యం కాదు. మనమందరమూ ధర్మశాస్త్రానికి బధులమై యుండవలెను.

రామ---ఆపాపానికి ప్రాయశ్చిత్తమేమిటో సెలవిస్తారా!

అంజ---శ్లో.---గోగామిరత్రిరాత్రేణా గామేకాం బ్రాహ్మణోదదత్.---అన దానికిందశ్లోకములోనే వున్నది.

రామ---అలాగయితే నేను మహాద్విజుణ్ని. యీకామధేనువును సూర్యోదయం కాగానే నాకు దానంయిప్పించండి అన్ని పాపాలూ పరిహారమైపోతవి.

మల్లు---దానంచెయ్యడం చచ్చిన గొవునా బ్రతికిన గోవునా?

రామ---ధర్మశాస్త్రవిషయం నీకేమి తెలియదుగాని నీకొండముచ్చు ఛెస్టలుమాని నూరుమూసుకు వూరుకో.

వ్యాఘ్రా---బ్రతికివున్నగోవునైతే దానం నాకివ్వవలెను. నేను పెద్దసభాపతిని.

రామ---నీకు సభాపత్యం యెవరిచ్చినారు!

వ్యాఘ్రా---నాచేతులు యిచ్చినవి; నానొరు యిచినది. అన్నధలైన మీకువలె సభాపత్యం నాకుపూర్వులనుంచి రావలసినపనిలేదు. మీవలెనేను శవాలిని పీక్కుతినే వాణ్నిగాను. మహారాజులాగు బ్రతికివున్నవాళ్ళనే పీక్కుతింటాను. పూర్వుల పేర్లుచెప్పి సభాపతులమని పోట్లాడమే కాని పొట్టకోసినా మీలో వక్కడికీ చిన్న మెత్తు తెలివిలేదు. నేను నాస్వశక్తి చేతనే సభాపతత్వం తెచ్చుకున్నాను. మీలోయెవరు నేను సభాపతిని కానంటారోరండి. వక్కసారిగా అందరి గొంటుకలూ కొరికివేస్తాను. (అని లేచుచున్నాడు.)

రామ---(తనలో) ఇతను బలవంతుడు. ఇతనితోపొట్లాడితే కార్యంలేదు,