పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 06-4 ఆహిరి సం: 10-033

పల్లవి:

నన్ను నేఁ బొగడుకొన్నా నాయము గాదు గాక
కన్నెనాటనుండి నీకెకాఁ బాటువడనా

చ. 1:

అ యింటివారిచే నారడిఁ బడితిఁగా
నెయ్యపు వలలఁ జిక్కి నీకొరకు
గయ్యాళి నావలపులు కతలై నిలిచెఁగా
వెయ్యైనాఁ దలచుకొంటె వెనకముందరికి

చ. 2:

అక్కటా చెలులతోఁ గల్లానలు వెట్టితిఁగా
పక్కన నీవిచ్చినట్టి బాసలు నమ్మి
రొక్కమైన నాపొందులు రోఁకటఁ బాడిరిగా
దిక్కులు నిండెఁగా నీవు తెలియకుండినను

చ. 3:
చెల్లఁబో యిందరిలోఁ బచ్చి సేయించుకొంటిఁగా
యిల్లు వెళ్ల నట్టి నీ యిచ్చకానకె
కల్ల లాడక శ్రీవెంకటనాథ కూడితివి
మల్లడి యీరతి మనమనసు లెరుఁగుఁగా