ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 06-5 పాడి సం: 10-034
పల్లవి:
ఇంతేసి పారుపత్తే లేమీ నీకు
అంతంతకు గరిసించే వత్తునా నే నీకు
చ. 1:
కూడఁ బారివచ్చి నా కుల మేల యడిగేవు
వేడుకకాఁడ నాతో వియ్య మందేవా
నాడొడివటనె నాప రే లడిగేవు
చేడెలపైఁ బద్దేలు చెప్పుదువో నీవు
చ. 2:
సరసానఁ జెయివట్టి సత్తు వేమి చూచేవు
బిరుదుకు నాతోడఁ బెనఁ గేవా
సొరిది నాపై నోరచూప లేమి చూచేవు
తిరిగి తిరిగి వంక దిద్ద వచ్చేవా
చ. 3:
ముద్దు ముద్దువలె నాకు మొక్కు లేమి మొక్కేవు
కొద్దిమీర నీవు నన్నుఁ గోలిచేవా
అద్దొ మండెమురాయఁడవై నన్నుఁ గూడితివి
గద్దరివైన శ్రీవెంకటనాథుఁడా