పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 04-3 మలహరి సం: 10-020

పల్లవి:

చుల్లరవెట్టుఁ జేతల చొక్కనాథఁడు
వుల్లములో నీ నెలఁదలూరి చొక్కనాథఁడు

చ. 1:

అద్దమరాతిరికాడ నంటువడి వచ్చి తాను
సుద్దు లేమి పచరించీఁ జొక్కనాథఁడు
వద్దు వొమ్మనవె రేపువచ్చుఁ గాని యిప్పు డేల
వొద్దికి వచ్చీ నెలఁదూరి చొక్కనాథఁడు

చ. 2:

మిక్కిలిఁ దా నెక్కడనో మీఁదువోయివచ్చి నేఁడు
చక్కటు లేమి చెప్పినె చొక్కనాథఁడు
పెక్కు లేల నేనె పిలిపించఁగా వచ్చీ
వొక్కటిగా నీ నెలఁదలూరి చొక్కనాథఁడు

చ. 3:

యిప్పుడె తా నెవ్వతెకో యెంగిలియై వచ్చియిట్టె
చొప్పులు మాస వచ్చీనె చొక్కనాథఁడు
కప్పురపుమోవి శ్రీవెంకటనాథుఁడె నన్ను
వొప్పుగాఁ గూడె నెలఁదలూరి చొక్కనాథఁడు.