Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 04-2 ఆహిరి సం: 10-019

పల్లవి:

మిక్కిలి నేరుపరివి మేలు మేలోయి
గుక్కనివలపుల వో కోన చెన్నరాయఁడా

చ. 1:

గారవించి నామనసు కరఁగించ వచ్చేవు
వారకపు వలపుల దేవరవు గావా
పేరడి నీపెనపుల ప్రియములనె నన్ను
కూరిమి గొసరెటి వో కోన చెన్నరాయఁడా

చ. 2:

మెచ్చి మెచ్చి నాతో నమ్మికమాఁట లాడేవు
తచ్చన వినయాల యాతఁడవు గావా
ముచ్చట నీజాణతనములనె నామీఁద గుది
గుచ్చేవు మాయ లెల్లాఁ గోన చెన్నరాయఁడా

చ. 3:

యెన్నికసరసాల నా కిచ్చకాలు సేసేవు
కన్నెవలపు వేడుకకాఁడవు గావా
నన్ను నిట్టె శ్రీవెంకటనాథుఁడ కూడితివి
కొన్నదె కో లిఁక నీకుఁ గోన చెన్నరాయఁడా.