పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 02-4 హిజ్జిజీ సం: 10-9

పల్లవి:

నీ వేమి సేతువు నానేరమోయమ్మా
చేవ నీయిచ్చ రాజ్యము సేయవోయమ్మా

చ. 1:

వలపించి రమణుఁని వాకిలి వెళ్లనీవు
కలికిచేఁతలనె కదవమ్మా
చలమున నావిభుని జంకించి నాఁడు నాఁడె
నెలవై నే నింతేసి నేరనైతినమ్మా

చ. 2:

నయమున నాపతిని నాయింటికిరాకుండా
బయకారించితివిగా పదవమ్మా
పయిపడి యతనిచే బాసలెల్లఁ జేయించుక
జయముతోడుత నుండఁజాలనై తినమ్మా

చ. 3:

నటలకు నామగని జంటవాయక న న్నిట్టె
అటమటించితివిగా అవునమ్మా
నటనతో శ్రీవెంకటనాథుడు మ నిద్దరిని
యిటులనె సరిగా నేలెనోయమ్మా