ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు:. 02-3 శ్రీరాగం సం: 10-8
పల్లవి:
ఇంతిచక్కఁదన మిఁక నేమని కొనాడుదమ
చెంత నాతఁడును నీపె చేతలకె భ్రమసె
చ. 1:
మొలక నవ్వుల చెలిమోము చూచి విభుఁడు
తొలఁకువెన్నెలల చందురుఁ డని భ్రమసె
మలయు జంకెనల బొమ్మలుచూచి రమణుఁడు
వెలయఁగ మదనుని విండ్లని భ్రమసె
చ. 2:
సొగసిన చెలి చూపు చూడ జూచి ప్రియుఁడు
పగతో మరుఁ డేసిన బాణ మని భ్రమసె
మగువ యాడినయట్టి మాఁట విని నాయకుఁడు
పగటునఁ గోవిలపలు కని భ్రమసె
చ. 3:
కరఁగించి చెలి దన్ను కాఁగిలించిననుఁ బతి
తిరమైయున్న మెరుఁగుఁ దీగె యని భ్రమసె
గరిమతోడుత శ్రీవెంటనాథుడు కాంత
వరుసఁ గూడఁగ పరవశమున భ్రమసె