పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 02-2 శంకరాభరణం సం: 10-7

పల్లవి:

చాలుఁ జాలు నే నెరంగనా నాఁడు నాఁడె
ఆలరి నీసుద్దు లెల్ల నన్నీఁ గంటిని

చ. 1:

సారె సారె నన్ను నేల పిలిచేవు
యేరా నీ వలపు నే నెరఁగనిదా
వూరకె యింకా నేలరా మాఁటలనె
దూరేవు నీసుద్దు లెల్ల తొల్లె కంటిమి

చ. 2:

సన్నలు సేసే సేమిరా యెరఁగనా
చిన్ననాఁడె నీ చేఁత లెల్లాను
చన్నులుముట్టే వేమిరా నాలికాఁడ
వున్నతి నీసుద్దు లెల్లా నిన్ననె కంటిమి

చ. 3:

దగ్గరి చేయి వట్టేవురా యెప్పుడును
నిగ్గుల నీ చల మెల్లా నే నెరఁగనా
అగ్గమై శ్రీవెంకటనాథ కడపలో
దగ్గరి నన్నుఁ గూడగా తలఁ పెల్లాఁ గంటిమి