పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0006-05 లలిత సం: 10-035

పల్లవి:

తచ్చిచూచితేఁ జాలు దైవమే కలఁడుగాక
హెచ్చినమాయలఁ బడ నేల మాకు నిఁకను

చ. 1:

సారె సారె నే నెంతసంపదలు గోరినాను
పోరచి నీదేహమెకా భోగించేది
యీరీతి మనసు దా నెన్నటికిఁ దనిసీని
గారవాన హరి నిన్నుఁ గన్నదె దక్కెను

చ. 2:

పలుమారు చావులేనిబదుకు కాసపడేది
యిలలోసంసారమెకా యేఁ జేసేది
కలిగినయాస యేకాలమున ముదుసును
అలరి విష్ణునిశర ణన్నదె నిలిచె

చ. 3:

వేడుకతో ఘనమైనవిద్యలు నేరిచినాను
జోడుగా నిందరికిని చూపు టింతేకా
వీడని తలఁపుతో శ్రీవెంకటనాథునిఁ గొల్చి
యీడేరి బదుకుటె యెన్ని కింతె కాకా