ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. ఆ. రేకు: 0006-04 దేసాళం సం: 10-034
పల్లవి:
ఏలికెవై నన్నొకని నేలఁగాను నీ
లీలావిభూతి కొకలేశము దక్కువా
చ. 1:
పనివూని నాయొకనిపాపము మానుపఁగా నీ
ఘనసంకల్పమునకుఁ: గడమా
చెనకి నేనె పూజ సేయఁగా మెచ్చేనంటె
కనుకొనే వందేమి కండ గట్టుకొంటివో
చ. 2:
దేవుఁడవై నామనసు దెరిచి రక్షించఁగాను
గోవింద నీమాయ కేమి గొఱతా
సోవల నాలోని భక్తి చూచి కాచే నంటివా
కావలసి నీ వెంత గాదెఁ బోసుకొంటివో
చ. 3:
అలరి నాహృదయమునందుఁ గానుపించితేను
వెలయ నీమహిమకు వెలితా
కలిమితో నన్ను శ్రీవెంకటనాథ కూడితివి
యిలమీఁద నీకు నిప్పు డెంతకీ ర్తి గూడెనో