పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 20-4 మాళవిగౌళ సం: 10-117

పల్లవి:

గాలి కూటి పేరిగట్టు మీఁదటివాఁడ
నేలసోద్యము పేరినెలఁత యె నిన్ను మెచ్చె

చ. 1:

తెలిమొయిలుపేరిటి తిలకము వెట్టి
వెలయఁ బైరెడి పేరి విరులు ముడిచి
బలిమి మరుని పేరిపండు చేఁ బట్టి
జలజము పేరిటిసతి నిన్నుఁ జూచె

చ. 2:

రేగాముపరిటి రెంటెము గట్టి
భోగిపేరితీగాకు పొఁసఁగ జుట్టుచును
బాగుగాఁ జుక్క పేరి యాభరణాలు వెట్టి
నాగముపేరిటి నాతి నిన్నుఁ బిలిచె

చ. 3:

సురపతిపేరిట్టి సరులు ధరించి
శిరుల మౌనిపేరి జీవముఁబట్టి
పొరి నీటిపేరిపాన్పున శ్రీవెంకటనాథ
విరిమీఁదిబిడ్డపేరి వెలఁది నిన్నుఁ గూడె.