Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 20-5 రామక్రియ సం: 10-118

పల్లవి:

చెప్పకురే వానిసుద్ది చెలులాల
వొప్పులు సేసిన తనవోజలు మానీనా

చ. 1:

తా నేవూరు నే నేవూరు తల మనవే చాలు
మానరాని వావు లేల మాకుఁ జెప్పీని
మోనాన నూరకుండరే మొన్నటివాఁడు గాఁడా
వూని గరివడ్డగింజ వుడుకఁ బోయ్యీనా

చ. 2:

యెక్కడి కెక్కడిపొందు లేలా మొక్కులుమొక్కి
దక్కినట్టి బాస లెల్లఁ దలపించీని
తక్కరించె నిన్నటి తగవరి తానె కాఁడా
మక్కువైనా చిలుక మానీనా గుణము

చ. 3:

యెంత కెంత మందెమేళ మిట్టె సంగటి నుండి
కాంతుఁడు న న్నేమిటికిఁ గాఁగిలించీనె
వింత లేక నన్నును శ్రీవెంకటనాథుఁడు గూడె
యెంత సేసినాఁ జక్కెర యేల తీపు మానును.