పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 18-4 వరాళి సం: 10-105

పల్లవి:

వెఱపించితిగా వోయి వేడుకకాఁడ
తెఱవ నీ మాఁట విని దిందుపడెఁ గాని

చ. 1:

పొలిఁతి నీమోముచూచి పున్నమచందురుఁడని
వెల వెలఁ బారి చాలా వెరచెనయ్యా
వలచి నీతామెరలవంటి కన్నుల జూడఁగా
కలఁకదేరి మరి కనువిచ్చి చూచెను

చ. 2:

కొమ్మ నీకురులు చచి గుంపుఁదుమ్మిదలనుచు
వుమ్మలూర మదిలోన నులికెనయ్యా
పమ్మిన పీలిపించపుపాగ చూచి నీ వనుచు
దిమ్ము విడిచి వొయ్యనె తెప్పిరిలె నిపుడు

చ. 3:

నల్లఁగలువ చేఁబట్టి నయముతో నీవు రాఁగా
పల్లదపు మరుఁడని భామ లోఁగెను
వెల్లవిరై కాఁగిట శ్రీవెంకటనాథ యింతిని
చల్లఁగా నీవు గూడఁగ సమరతి సేసెను.