ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చి. శృం. రేకు: 18-3 సామంతం సం: 10-104
పల్లవి:
మందుల మాయల బోదె మంచివలపు
బొందితోఁ బతికాఁగిట భోగింపించుఁ గాని
చ. 1:
కారుచిచ్చయినాఁ దొలుకరివానచే నారు
ఆరదు పన్నీటిజడి నంగతాపము
ఆరడై నీటిచేత ననల మారకుండునా
సారెఁ జెలి కోరిక వెచ్చలు రేఁచెఁ గాక
చ. 2:
జడివానైనా వెలుచు సంగడి చలికాలాన
యెడయదు చలువల నింతి చెమట
నిడివిఁ బుప్పొడి చల్ల నీరు దియ్యకుండునా
కడుఁ జెలియ మనసు కరఁగించీఁ గాకా
చ. 3:
వేవేగ నాయిటివోతె విసరదు బెట్టుగాలి
పోవు నిట్టూర్పులు పతిఁ బొందినా నీవె
శ్రీవెంకటనాథుఁ గూడి చెల్లునటె వుసురన
భావజకేలిలోపలి పరిణత గాకా