పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 17-3 సాళంగనాట సం: 10-098

పల్లవి:

ఔనయ్యా మే లెరిఁగిన ఆణికాఁడవు
తానక మైన నీ దొరతన మెల్లాఁ గంటిమి

చ. 1:

జక్కఁదన మెరఁగనిజాణవా నీ వేమైనా
తక్కరి వై గుజ్జుదానిఁ దగిలితివి
యెక్కువగా నాముందర యెవ్వరినో యెంచఁగాను
చక్కఁగా నామదిలోన చల్లఁ గాక వుండునా

చ. 2:

కన్నెపాయ మెరఁగని ఘనుఁడవా నీ వేమి
పిన్న వై రేవతిదేవిఁ బెండ్లాడితివి
యెన్నికె నాముందర నీయింతులజవ్వనమెంచె
తన్నిటా నామదిలోన నానందించ కుందునా

చ. 3:

యిట్టె వినయము నీ వెరఁగవా నీ రొమ్ము
మెట్టినయింతికె కడు మేలువాఁడవు
చిట్టకము లెంచేటి శ్రీవెంకటనాథ నన్ను
గటిగాఁ గూడితివి నేఁ గరఁగక వుందునా.