Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 17-2 ముఖారి సం: 10-097

పల్లవి:

దానిసాహసము మేలు తరవాత నీవు మేలు
వూనిన యారడికి ని న్నొడి గట్టించినది

చ. 1:

రవ్వగా మే నెల్లా జీరలుగాఁ జేయించుక
మవ్వపు నాయెదుట నీవు మలసేవు
నవ్వుల కైనాను నామాఁట మీరనినిన్ను
యెవ్వతెరా నిన్ను నింతగాఁ జేసినది

చ. 2:

చిగురు నీమోవి యెల్లా చిల్లులుగాఁ జేయించుక
వెగటుగా నాయెదుట విఱ్ఱవీఁగేవు
తగవుల కైనా జివగాఁటని నిన్నుఁ దెచ్చి
జగ నీపై యింత సేసి చలి వాపెను

చ. 3:

చేవ దేర నీతురుము చిక్కువడఁ జేయించుక
శ్రీవెంకటనాథ కడుఁ జెలఁగేవు
యేవేళ నన్నుఁబాయక యెనసి వుండితినిన్ను
యీవేళఁ జెనకుచు యెమ్మెలు సేసినది