పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 17-1 దేసాళం సం: 10-096

పల్లవి:

సిగ్గువడ నేమిటికి చెలువమె యిది నీకు
యెగ్గు లేదు యిట్టె సింగారించుకొనవయ్యా

చ. 1:

కపురపు బలుకుల కంటసరులు నీకు
యిపు డిట్టె చెలి యంపె నిందవయ్యా
చపలపు నీమెడ చంద్రవంకల మీఁద
కపురై వుండు నిట్టె కట్టుకొనవయ్యా

చ. 2:

నెలకొన్నకస్తూరి నిగరపుఁ బోఁగులు
కలికి నీకు నంపెఁ గైకొనవయ్యా
యెలమిని మేదించినితరవాసనఁ గప్పె
పెలుచ వందురు యిట్టె పెట్టుకొనవయ్యా

చ. 3:

కోవరపుఁ బచ్చికుంకుమపూవుదండ లంపె
శ్రీవెంకటనాథ యింతిఁ జేకొనవయ్యా
తోవల నీమై నంటిన తొలుతటి పస పెల్లా
వేవేగ నిది గప్పె వేసుకొనవయ్యా