పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 16-6 నాదరామక్రియ సం: 10-095

పల్లవి:

ఎత్తూ నొరాఁ గల దిటువంటిది వలపు
యిత్తరి గాఁకల వన్న యించుకాఁ దియ్యదు

చ. 1:

మచ్చికతోడుతఁ దూఁగు మంచపుఁ దాసుమీఁద
నిచ్చ నిండ జవ్వనపు నీవొక్కచో
నిచ్చలపు గుణముల నే నొక్కచో నుండఁగాను
అచ్చముగా సరిఁ దూఁచె నతనుఁడే యిపుడు

చ. 2:

మించి చలువరాయనే మెచ్చుల వొరగంటిపై
నించినట్టి వేడుకల నీదేహము
దించని తమకపు నాదేహమూఁ బెనఁగఁగా
పొంచి సరిగా నొరసె పూవిలుతుఁ డిపుడు

చ. 3:

కలసె పూఁబానుపు మొగ్గుల గొప్పసళాకలు
నిలువున శ్రీవెంకటనాథ నీరతికి
కొలఁది మీరఁగ నేఁ గడిన సమరతికి
వలె నని వనె వెట్టీ వలరాయఁడిపుడు