పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. ఆ. రేకు: 0003-02 వరాళి సం: 10-014

పల్లవి:


మాఁటిమాఁటికిఁ జూచి మరపులేలె
నీటునఁ బాటిగంప నీళ్లు మోచేవా

చ. 1:

తెలిపేగురుఁ డుండఁగ తెలియఁగ నేరవు
చిలుకచదువులే లోజీవుఁడా
అలవోక నెందై న ఆస మానలేవు
కల గన్నచోటి కెల్ల గంపయెత్తేవా

చ. 2:

వొబ్బిడైనవేదమార్గ మొల్లనిపుణ్య మంటేవు
జిబ్బిటాయతప మేలె జీవుఁడ
అబ్బురపువేడుకల నలుసేవు పలుమారు
గబ్బివై పారేబండికిఁ గాలు చాఁచేవా

చ. 3:
వొల్లనెసంసారములో నూరకె గర్వించేవు
చెల్లఁబో రొయ్యకోవ్వేలె జీవుఁడా
నల్లని శ్రీవెంకటనాథుని బంటవైతివి
తల్లకిందేల మేరువు తలగడనుండఁగా