పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 14-4 కన్నడబంగాళం సం: 10-081

పల్లవి:

బాలుఁడు సేసెటి పనులా
వోల వేయవచ్చీ నోయమ్మా

చ. 1:

చన్నులపైఁ జెయి చాఁచీనే యివి
చిన్నవాండ్ల చేఁతలా
కన్నులు గిరిపీ గామి డై
వున్నాఁ డిప్పుడు వోయమ్మా

చ. 2:

పస నీమోవిపైఁ బల్లు సోఁకించీ
పసిబిడ్డలబాగులా
కొసరుమాఁటల గో రంటి విడె
మొసఁగీ నిప్పుడె కోయమ్మా

చ. 3:

నిండారఁ గాఁగిట నించీనే యివి
కొండుకబిడ్డలగుణములా
వెండిఁ బైఁడి నిచ్చి శ్రీవెంకటనాథుఁడు
వుం డుండి ననుఁ గూడె నోయమ్మా