Jump to content

పుట:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చి. శృం. రేకు: 14-3 మాళవిగౌళ సం: 10-080

పల్లవి:

బెల్లపుమాఁటల చెల్లపిళ్ల రాయఁడా నీకు
జెల్లునయ్య యేమైన చెల్లపిళ్ల రాయఁడా

చ. 1:

పేలరిమాఁట లాడేవు పెద్దతనమా యిది
పీలిచుంగుతోడి చెల్లపిళ్ల రాయఁడా
కాలు దాఁకించినప్పుడె కళ లంటె నిఁక నేల
చేలకొంగు వట్టే వు చెల్లపిళ్ల రాయఁడా

చ. 2:

యీతల నాకుఁ బరచే వింతటి దొరవు నీ
పీతాంబరము చెల్లపిళ్లరాయఁడా
ఘాతల నీగోరు దాఁకి కరఁగితి నిఁక నే నీ
చేతిలోని దాన నింతె చెల్లపిళ్లరాయఁడా

చ. 3:

నెట్టన దేవరవంటి నీమేనిసొమ్ము నాకుఁ
బెట్టేవుగా చెల్లపిళ్లరాయఁడా
గట్టిగా నన్ను శ్రీవెంకటనాథుఁడ వై కూడి
చిట్టెకాలు సేసేవు చెల్లపిళ్లరాయడా.