పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0216-4 సామంతం సంపుటం: 08-094

పల్లవి:

అప్పటనుంటియుఁ జెప్పేవాసుద్దులు
అప్పుడే అన్నియువింటినాసుద్దులు

చ. 1:

అంగడికెల్లానెక్కెను ఆసుద్దులు
అంగనలందరు విన్నారాసుద్దులు
అంగమా నాకాడుకోను ఆసుద్దులు నీకు
నంగదలన్నియుఁ బాపనాసుద్దులు

చ. 2:

ఆరితేరెనింతలోనే ఆసుద్దులు
ఆరచి కతలవంటివాసుద్దులు
ఆరఁగాఁ బండినపంటలాసుద్దులు
ఆరీతినే యియ్యకొంటినాసుద్దులు

చ. 3:

అలుకలిన్నియుఁబాపె నాసుద్దులు
అలయని రతులలో నాసుద్దులు
అలమేల్‌‌మంగను నేను ఆసుద్దులు
అలమితి శ్రీవేంకటేశాసుద్దులు