పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0216-5 భైరవి సంపుటం: 08-095

పల్లవి:

ఆతనివగలెరఁగరమ్మలాల
చేతులువట్టి బలిమిసేయకురే మీరు

చ. 1:

నిద్దిరించేనంటాను నెలఁతలరాకలకు
వొద్దికెఁగాచుక వున్నాఁ డూరకే తాను
వొద్దికి రమ్మనీనంటా వొడివట్టి తియ్యకురే
యిద్దరు చెలులున్నారు యెక్కుడా నేను

చ. 2:

మోనాననుండేనంటా మచ్చుటతోఁజెలులకు
ఆనుక పొంచుక వున్నాఁడక్కడఁదాను
ఆనవెట్టెనాతఁడంగానందరుఁబిలువకురే
లోననున్నవారికంటె గుట్లునేరుతునా

చ. 3:

చేసన్న సేసేనంటా సేమంతి బంతిని నన్ను
వేసె శ్రీవేంకటాద్రి గోవిందుఁడే తాను
సేసవెట్టి కూడినాఁడు చెరఁగు వట్టించకురే
బాసగొన్నవారికంటె బలువా నేను