పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-2 మలహరి సంపుటం: 08-074

పల్లవి:

ఏలనన్నుఁబాసితివి యిందాఁకానేడపరాకు
తాలిమిగలదాననా తలఁచి నీయడకు

చ. 1:

మొక్కితిఁగా అల్లనాఁడె మొరఁగులు మానుమని
తక్కులేక వలచినదాన నేనని
నిక్కపుటాసలు నాలో నిండియుండవివియని
మక్కువనాతోఁగూడి మన్నించుమని

చ. 2:

సేవలెల్లాఁ జేసితిగా సిగ్గులు వడకుమని
వేవేలు నావిన్నపాలు వినుమని
భావించునావల్ల నీకు పంతమెల్లాఁజేరెనని
నీవల్లఁ దప్పులేకుండా నెరవేరించుమని

చ. 3:

కప్పితిఁగాపయ్యద యీకపటము వాసెనని
చిప్పిలె నాచిత్తము నీచేఁతలనని
యిప్పుడె శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టె
దప్పిదేరె మోవితేనెఁదనిసితినని