పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0213-1 హిజ్జిజి సంపుటం: 08-073

పల్లవి:

కానీవే యెంతకెఁత గబ్బితనము
యీనెపములెల్లాను యెరఁగనటె

చ. 1:

నవ్వులనె వొకమాట నటనలనొకమాట
దివ్వెనలనొకమాట తిట్టేవేమే
పువ్వులనె వొకవాటు పోరచినె వొకవాటు
యివ్వలనే వేసితేను యేమిసేసేవే

చ. 2:

కన్నులమొనలుచూపి కతలమొనలుచూపి
చన్నులమొనలుచూపి సాదించేవే
నున్ననిగోరుదీసి నూఁగురుల కొప్పుదీసి
యిన్నినే రట్టుసేసితే నేమిసేసేవే

చ. 3:

బిగువుఁగాఁగిటఁ బట్టి బీరమునఁ జలపట్టి
పగటున కొనగొంగు పట్టేవేమే
జిగిమించఁగలసితి శ్రీవేంకటేశుఁడఁదాను
యెగసక్కేల దూరితే నేమిసేసేవే