పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0212-5 రామక్రియ సంపుటం: 08-071

పల్లవి:

ఏలనాచే మొక్కించేరే యిప్పుడేనన్ను
కాలగాలమున మేలు కనుఁగొనేఁగాక

చ. 1:

పంతమే ఫలముగాఁక బ్రదికేటి వారికి
చెంతలఁ బ్రియాలు చెప్పఁజెల్లునటవే
దొంతులు వేరిచేనంటే తోదోపులు వలపులు
కాంతుఁడు మన్నించిన కనుఁగొనేఁగాక

చ. 2:

రాజసమే ఫలముగా రచ్చసేసేవారికి
వోజదప్పి కిందుపడ నొనరునటే
సాజము చూచేనంటే చలములు బహళము
పూజ లాతనిచేతనే పొరసేఁగాక

చ. 3:

కూటములె ఫలముగా గురియైనవారికి
పాటించి కోపించుకొనఁ బాడియటవే
యీటున శ్రీవేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె
తేటలనాతనివల్లఁ దిరమయ్యెఁ గాక