పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0210-6 దేవగాంధారి సంపుటం: 08-060

పల్లవి:

ఇంకేల మొరఁగేవే యింతి మాతో నేఁడు
లంకెసింగారముల లలి మీరుఁ గాక

చ. 1:

చిగురుఁ గెమ్మోవిపై చిలుక వోట్లమరునా
మిగులఁగ కోవిలల మేఁత గాక
జిగిఁ జెక్కుటద్దముల చెమటచిత్తడేలే
పొగరుమెఱుఁగుల కళల పొడి రాలుఁగాక

చ. 2:

జక్కవకుచంబులకు చంద్రోదయములేలే
నిక్కి రత్నపుటెండ నిగుడుఁ గాక
పక్కన నడుమును బయలువాఁకనేలే ఆరు
అక్కడ నిట్టూర్పుగాలి అలరుఁ గాక

చ. 3:

పొంచి తనువల్లిపై పులకమొలకలు (ల?) దేలె
పంచాస్త్రువిదులందు పరుగుఁ గాక
యెంచగల శ్రీవేంకటేశుఁడిదివో కూడె
ముంచుకొని తలఁబాలు మురుకొనుఁ గాక