పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-1 సామంతం సంపుటం: 08-037

పల్లవి:

పొద్దువోనివాఁడవై పూఁచి మమ్ముఁ జెనకేవు
సుద్దులు చెప్పినవారు సూడిచ్చేరా

చ. 1:

ఆడినమాటకుత్తరమాపె నీకీవలెఁ గాక
వాడికచెలుల మెల్లా వాదించేమా
జాడగాదు మాతోనేల సరసాలాడేవు
వీడేలందుకొన్నవారు వియ్యమందేరా

చ. 2:

చేసినచేఁతకుఁజేఁత చెలి నిన్నుఁ జేసుఁగాక
యీసుదీర్చేచెలులము యియ్యకొనేమా
సేసలువెట్టితినంటా చెరగులేల పట్టేవు
కైసేసిన పేరఁటాండ్లు కాలుదొక్కేరా

చ. 3:

కొంకక నీరతులకు గురి నీదేవులే కాక
వంకలొత్తే చెలులము వావి చెప్పేమా
కంకిగా శ్రీవేంకటేశ కాంత దానే వచ్చి కూడె
లంకెల చుట్టాలము మేలములాడేమా