పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0207-2 ముఖారి సంపుటం: 08-038

పల్లవి:

తెలిసితిమిన్నాళ్ళకు దేవరగుట్టు
వెలుపల లోపల వెలసితివింతటా

చ. 1:

కాయము వొక్కతెమీఁద కనుచూపొక్క తెపై
ఆయనాయనెంత నీకు ఆసోదము
యేయెడఁ జూచిన నీవు యిరుమొనసూదివై
చాయలకు నాలుగుహస్తములు ధరించితి

చ. 2:

వుండేది వొక్కతెయింట పండేది వొక్కతెవద్ద
రండును నడుపేవు నీ రాజమున
పండును గాయయునైన బలుపుల్లదొరవై
యెండ నీడ కన్నులను యెలయించేవిపుడు

చ. 3:

వురమున మహలక్ష్మీ వుర్విని వీపున మోవి
సిరుల మించేవు నేఁడు శ్రీవేంకటేశ
తొరలించి వలపుగుదులు గుచ్చినవాఁడవై
పరమున నిహమునఁ బాయవు నీవిపుడు