పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0206-3 ఆహిరి సంపుటం: 08-033

పల్లవి:

ఇంకనేడ సుద్దులు యెవ్వరెందుకును దిక్కు
బింకమున నీకే మొరపట్టుతింతే (ట్టుడిం?) కాక

చ. 1:

ఆసకొలిపి నీవు అన్నిటాను వలపించి
పాసి వుండితే మనసు పట్టవచ్చునా
నేసవెట్టి పెండ్లాడి చేతికి లోనై
వేసరుకొంటే నాదెస విన్నవించవచ్చునా

చ. 2:

పెంచి పెద్దరికమిచ్చి పిలువక సతులలో
కొంచెపరచితేనంత గోడు గలదా
మంచముమీఁదికిఁ దీసి మన్నించి అంతలోనే
కొంచించి నిద్రవోఁబోతే కొల దాఁకదా

చ. 3:

కాఁగలించనప్పణిచ్చి కడుఁ జన్నుల నొత్తితే
లోఁగేవు నవ్వరా నిన్ను లోకులెల్లాను
యేఁగి వచ్చి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
చేఁగదేర మెచ్చితేను చెవి సోఁకెనా